by Suryaa Desk | Fri, Nov 22, 2024, 12:38 PM
హైదరాబాదులోని KPHB దగ్గర ఉన్న మధురం టిఫిన్స్ సెంటర్లో గురువారం ముగ్గురు కస్టమర్లకు చట్నీలో బొద్దింకలు వచ్చాయి. వారు కిచెన్ ఎలా ఉందో చూద్దామని హోటల్ లోనికి వెళ్లారు. బాత్రూం పక్కనే కిచెన్ ఉండటం చూసి కంగుతిన్నారు. టాయిలెట్ పక్కనే ఉన్న కిచెన్‌లో పిండి, చట్నీ రుబ్బుతున్నారు. ఇంత దారుణంగా ఉన్న ఇలాంటి హోటల్స్‌ని సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.