|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 12:40 PM
శివ కందుకూరి, తేజు అశ్విని జంటగా ప్రమోద్ హర్ష దర్శకత్వంలో 'నవాబ్ కేఫ్' చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుంది. మొదట 'చాయ్ వాలా'గా నిర్ణయించిన టైటిల్‌ను సెన్సార్ నిబంధనల కారణంగా మార్చారు. ఈ టైటిల్ సినిమా కథకు, ఆత్మకు సరిపోతుందని హీరో శివ కందుకూరి తెలిపారు. నిర్మాత వెంకట్ ఎటువంటి రాజీ పడకుండా సినిమాను నిజాయితీగా రూపొందించారని, ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని ఆయన అన్నారు. దర్శకుడు ప్రమోద్ హర్ష తాను చూసిన, అనుభవించిన సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.నిర్మాత వెంకట్ మాట్లాడుతూ .. ‘అసలు మాకు టైటిల్ మార్చమని అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. నేను ముంబైకి వెళ్లాను. సెన్సార్ టీంతో మాట్లాడాను. ‘చాయ్ వాలా’ అనే టైటిల్ వద్దు అని చెప్పారు. ఆ తరువాత మేం చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ మేం వర్కింగ్ టైటిల్‌గా పెట్టుకున్న ‘నవాబ్ కేఫ్’నే చివరకు ఫిక్స్ చేశాం. మా ఈ ‘నవాబ్ కేఫ్’ టైటిల్‌ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మాకు మీడియా సపోర్ట్ ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
Latest News