|
|
by Suryaa Desk | Mon, Oct 16, 2023, 01:57 PM
బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా భగవంత్ కేసరి ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో ఆ మూవీ దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర విషయాల్ని చెబుతున్నారు. శ్రీలీల తనకు వరసకు కోడలు అవుతుందంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె తల్లి స్వస్థలమైన పొంగులూరు, తన అమ్మమ్మ గారి ఊరు అని, శ్రీలీల తల్లి తనకు వరసకు అక్క అవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ లో శ్రీలీల మావయ్యా అంటూ ఆటపట్టించేదని వెల్లడించారు.
Latest News