![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:53 AM
యూకే ప్రభుత్వం ప్రకటించిన ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. నాలుగు దశాబ్దాలకుపైగా చిత్ర పరిశ్రమలో చేస్తున్న సేవలను, వ్యక్తిగతంగా ఆయన చేసిన దాతృత్వానికి, ఆదర్శప్రాయమైన ఆయన కృషిని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవిని సత్కరించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా రేపు (19న) ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనుంది. ఈ నేపథ్యంలో పురస్కారాన్ని అందుకునేందుకు లండన్ బయలుదేరిన మెగాస్టార్ హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అభిమానులు అక్కడాయనకు ఘన స్వాగతం పలికారు.
Latest News