![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:43 PM
నటి విష్ణు ప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమెతోనే ఆపేస్తారా, మిగతా వారిపై కూడా చర్యలు ఉంటాయా అన్నది తెలియాల్సి ఉంది.ఈ రోజు(మంగళవారం) సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు తమ ముందు హాజరు కావాలని పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియకు నోటీసులో స్పష్టం చేశారు. విష్ణు ప్రియను అరెస్ట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. మరి కొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కేసులో ఉన్న నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో వారు ఎక్కడున్నారని ఆరా తీసే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన 11 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రెటీలపై పంజాగుట్ట పోలీసులు సోమవారం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Latest News