|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 03:19 PM
సాలార్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'సాలార్ పార్ట్ 1: సీసెఫైర్ డిసెంబర్ 22, 2023న భారీ బజ్ మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానల్ లో జూన్ 1, 2025న ఉదయం 08:00 గంటలకు ప్రసారం కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, గోపి, ఈశ్వరి రావు, జగపతి బాబు, శ్రీయ రెడ్డి, బ్రహ్మాజీ, బాబీ సింహ, టిన్ను ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. హోంబలే ఫిలింస్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
లక్కీ బాస్కర్: మాలీవుడ్ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ యొక్క తెలుగు చిత్రం 'లక్కీ బాస్కర్' బహుళ భాషల్లో విడుదలై విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా 100 కోట్లు వాసులు చేసింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానల్ లో జూన్ 1, 2025న మధ్యాహ్నం 01:00 గంటకు ప్రసారం కానుంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో రామ్‌కి, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్, రిత్విక్, సచిన్ ఖేడేకర్ మరియు పి. సాయి కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
వీర సింహారెడ్డి: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం స్టార్ మా ఛానల్ లో జూన్ 1, 2025న మధ్యాహ్నం 03:30 గంటలకు ప్రసారం కానుంది. శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి హనీ రోజ్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
విశ్వం: శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ నటించిన 'విశ్వం' యొక్క శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జూన్ 1న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కావ్య థాపర్ గోపీచంద్ కి జోడిగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, వెన్నెల కిషోర్, ప్రగతి, ప్రవీణ్, VTV గణేష్ మరియు ఇతర నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. TG విశ్వ ప్రసాద్ మరియు వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
Latest News