by Suryaa Desk | Wed, Sep 18, 2024, 10:24 AM
కోహెడ మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ వీధి నుండి విశ్వకర్మ ఆలయము వరకు శోభాయాత్ర నిర్వహించి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ సంఘ సభ్యులు విశ్వకర్మ భగవాన్ కి పూజ కార్యక్రమాలు చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిప్పారపు శ్రీకాంత్, అధ్యక్షులు రేవోజు సదానందంచారి, అధ్యక్షులు గూడూరి రవీందర్ చారి, ప్రధానకార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.