by Suryaa Desk | Wed, Sep 18, 2024, 02:33 PM
తెలంగాణ 10వ రాష్ట్ర స్థాయి సౌత్ జోన్ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకొరకు ఈ పోటీలలో జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తేదీ 08.09.2024 నాడు మెట్ పల్లి వివేకానంద స్టేడియంలో అథ్లెటిక్స్ నిర్వహించారని అందులో మల్యాల జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మర్రిపల్లి శ్వేత ట్రాయత్లిన్, లాంగ్ జంప్,60 మీటర్స్ రన్నింగ్,షార్ట్ ఫుట్, 14 ఇయర్స్వి.
భాగమంలో పాల్గొని హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 19,20 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి సౌత్ జోన్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని, పిడి ఎదులాపురం ఆంజనేయులు తెలిపారు. బాలికను ప్రాధానోపాధ్యాయురాలు నీరజ తోపాటు , ఉపాద్యాయులు అభినందించారు.