|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 03:47 PM
TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాయి. తాజాగా ఆలియాబాద్ మున్సిపాలిటీలోని లాల్‌గడి మలక్‌పేటలో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే డీజే విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం.డీజే సౌండ్ తగ్గించాలని కోరితే బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేశారు. దాడిలో లాల్‌గడీ మలక్‌పేటకు చెందిన పరమేష్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా, దాడి చేయడమే కాకుండా కాంగ్రెస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్, మాజీ డీసీసీ అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు ఆందోళన చేపట్టారు