|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 12:28 PM
బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ నటిగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అరుదైన ఘనత సాధించింది. 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' సినిమాతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా ఈ ఘనత సాధించలేకపోయారు. తమన్నా సినీ ప్రయాణం 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో ప్రారంభమై, 'హ్యాపీ డేస్', 'అయాన్' వంటి సినిమాలతో సౌత్ ఇండస్ట్రీలోనూ రాణించింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.రికార్డ్ బ్రేకింగ్ హీరోయిన్.. సౌత్ ఇండస్ట్రీని ఏలిన ఈ అందాల తార, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో దుమ్మురేపుతోంది. మిగతా హీరోయిన్లంతా కేవలం బాలీవుడ్ మీద ఫోకస్ పెడితే, తమన్నా మాత్రం రూట్ మార్చి సౌత్ నుంచి నార్త్ వరకు తన సత్తా చాటింది. తమన్నా సినీ ప్రయాణం అంత ఈజీగా ఏమీ మొదలవ్వలేదు.
Latest News