|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 03:08 PM
దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’తో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగినా, ‘ఆచార్య’తో వెనుకడుగు పడింది. ఎన్టీఆర్‌తో ‘దేవర’ భారీ వసూళ్లు సాధించినా అభిమానులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ‘దేవర 2’పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని, స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతోందని మేకర్స్ వెల్లడించారు. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’లో బిజీగా ఉండటంతో ‘దేవర 2’ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందో వేచి చూడాల్సిందే.
Latest News