|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 01:12 PM
హీరో సంతోష్ శోభన్, మాజీ మిస్ ఇండియా మానస వారణాసి జంటగా నటించిన కొత్త సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. ప్రేమికుల రోజు కానుకగా ఈ చిత్రం ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో చిత్ర బృందం విజయంపై ధీమా వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, "నాకు సక్సెస్ రావాలని అందరూ కోరుకుంటుండటం చాలా సంతోషంగా ఉంది. మొదట టైటిల్ చెప్పినప్పుడు నాకూ కొన్ని సందేహాలు వచ్చాయి. కానీ సినిమా చూశాక ఇదే సరైన టైటిల్ అనిపించింది. మంచి పాజిటివ్ వైబ్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా" అని అన్నారు. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, సినిమా సక్సెస్‌పై నమ్మకంగా ఉన్నామని హీరోయిన్ మానస వారణాసి తెలిపారు.డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ, "ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. కుటుంబ నేపథ్యంలో సాగే చక్కటి ఎంటర్‌టైనర్. హీరో హీరోయిన్ల మధ్య ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. ఫిబ్రవరి 13 సాయంత్రం నుంచే థియేటర్లలో షోలు ప్రారంభమవుతాయి" అని వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, వైజాగ్‌లలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
Latest News