|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 06:50 PM
ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'శ్రీ చిదంబరం గారు' చిత్రం, ఫిబ్రవరి 19 నుండి ETV Win లో స్ట్రీమింగ్ కానుంది. రాజమండ్రిలోని ఒక పల్లెటూరిలో మెల్లకన్నుతో బాధపడుతూ, 'చిదంబరం' అని ఎగతాళికి గురైన సోలమన్ (వంశీ తుమ్మల) తన ఆత్మన్యూనతా భావాన్ని అధిగమించి, లీలా (సంధ్య వశిష్ట)తో తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడనేది ఈ ఫీల్-గుడ్ డ్రామా కథ. వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారుణం. అసలు ఓటీటీ సంస్థలు చిన్న సినిమాలను తీసుకోవడమే గొప్ప అనేలా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. థియేటర్లలో విడుదలైన చిన్న సినిమాలకు ఒక వారం, లేదంటే రెండు వారాలకే స్ట్రీమింగ్ అనేలా కండీషన్స్ పెట్టి, ఓటీటీ సంస్థలు హక్కులు రాయించుకుంటున్నాయి. అలా, థియేటర్లో సినిమా మనుగడ రోజురోజుకూ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఇప్పుడో సినిమా విడుదలైన రెండు వారాలకే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే..శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా, చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ . వంశీ తుమ్మల సంధ్యా వశిష్ట (Sandhya Vasishta) జంటగా నటించిన ఈ చిత్రం వినయ్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కింది. అతనికిది మొదటి చిత్రం. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను రాబట్టుకుంది. వైకల్యం మనిషికే కానీ, మనసుకు కాదని చాటి చెప్పేలా వచ్చిన ఈ సినిమా.. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశంసలను అందుకుంది. అలాంటి ఈ చిత్రాన్ని కేవలం రెండో వారాల్లో ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. అవును ‘శ్రీ చిదంబరం గారు’ సినిమా ఫిబ్రవరి 19 నుంచి స్ట్రీమింగ్ (Sri Chidambaram Garu Streaming Date)కు రాబోతున్నట్లుగా, ఆ సినిమా హక్కులను సొంతం చేసుకున్న ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.
Latest News