|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 03:38 PM
జయ శివ సూర్య, నిఖిత శ్రీ, ఇషా మనోహరి ప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న '100 డేస్ లవ్ స్టోరీ' సినిమా ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 'అతి ప్రేమ భయానకం' అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ చిత్రం, ప్రేమ ఎక్కువైతే అది భయంకరంగా మారుతుందనే భావంతో యూత్‌ను ఆకట్టుకునేలా రూపొందించబడింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా, ప్రేమ కథల్లో కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ… ” కచ్చితంగా మా సినిమా ప్రేమ కథా చిత్రాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తుంది అని నమ్ముతున్నాము. దర్శకుడు విజయమిత్ర కథను డీల్ చేసిన విధానం, హీరో హీరోయిన్ల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఫిబ్రవరి 27న మా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి ఆదరిస్తారని భావిస్తున్నాను” అంటూ తెలిపారు.
Latest News