|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 07:03 PM
తెలుగు సినీ చరిత్రలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో గ్రేటెస్ట్ హిట్‌లలో ఒకటైన ‘అదుర్స్’కు సీక్వెల్ రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఒక సినిమా ఈవెంట్‌లో కోన వెంకట్ మాట్లాడుతూ, ‘అదుర్స్’ సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ రెడీ అయిందని, ఎన్టీఆర్ ఫ్రీ అయిన తర్వాత ఆయనతో చర్చించి ప్రాజెక్ట్ గురించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నిజానికి 2010 లో రిలీజ్ అయిన అదుర్స్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. అదుర్స్ చిత్రానికి కోన వెంకట్ కథను అందించారు. వి.వి. వినాయక్‌తో కలిసి ఆయన స్క్రీన్‌ప్లేలో కూడా కీలక పాత్ర పోషించారు. తాజాగా ‘అదుర్స్ 2’ గురించి అప్డేడ్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు, కామెడీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ ‘అదుర్స్ 2’ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది. ప్రస్తుతం యంగ్ టైగర్ ప్రశాంత్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తుండగా, దాని తర్వాత దేవర 2 చేయబోతున్నారని సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తి అయిన తర్వాత ‘అదుర్స్ 2’ కి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుంది ఏమో వేచి చూడాలి. ఏదేమైనా చారి ఈజ్ బ్యాక్ అంటే థియేటర్స్‌లో మామూలుగా ఉండదు.
Latest News