|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 04:06 PM
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'కల్ట్'. 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా దమ్కీ' తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వియత్నాంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా, నేటి యువతను ఆకట్టుకునేలా ఈ కథను విశ్వక్ సేన్ రాసి తెరకెక్కిస్తున్నారు. ఇందులో 40 మంది కొత్త నటీనటులు, గాయత్రి భరద్వాజ్ కథానాయికగా నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం, తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తున్నారు. ఫిబ్రవరి 21న టీజర్ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్, జపనీస్, స్పానిష్ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
Latest News