|
|
by Suryaa Desk | Mon, Oct 16, 2023, 02:44 PM
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో ‘దీపావళి’గా అనువదిస్తున్నారు. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘లేడీస్ టైలర్’ సినిమాతో స్రవంతి మూవీస్ సంస్థ తొలి అడుగు వేసింది.
ఈ 38 ఏళ్ళ ప్రయాణంలో ‘స్రవంతి’ రవికిశోర్ 38 చిత్రాలను నిర్మించారు. కంటెంట్ ఈజ్ కింగ్ అని కథను నమ్మి సినిమాలు తీస్తున్నారాయన. స్రవంతి మూవీస్ సంస్థలో 38వ సినిమా ‘కిడ’. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”చెన్నై వెళ్ళినప్పుడు ఓ స్నేహితుడి ద్వారా ఐదు నిమిషాల పాటు ఈ సినిమా కథ విన్నా. వెంటనే కనెక్ట్ అయ్యాను. దర్శకుడిని కథ మొత్తం రికార్డ్ చేసి పంపమని అడిగా. కథ నచ్చడంతో ఓకే చేశా. నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం ” అని అన్నారు.