by Suryaa Desk | Fri, Nov 22, 2024, 02:41 PM
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస శుక్రవారం నేపథ్యంలో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చారు. కార్తీకదీపాలు వెలిగించి స్వామివారి సేవలో తరించారు. భక్తుల ధర్మ దర్శనంలో ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. అందరిని చల్లంగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం స్వామి వారిని వేడుకున్నారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న సన్నిధానానికి కార్తీక మాసం నేపథ్యంలో కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారుతున్నాయి. రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కుఅయినటువంటి కోడె మొక్కులను భక్తులు కుటుంబ సమేతంగా దర్శించుకొని ధర్మగుండంలో పుణ్య స్నానాలు ఆచరించి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని సేవలో తరిస్తున్నారు. కోడె మొక్కులు చెల్లిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.