|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 03:47 PM
వేములవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించాలని సూచించారు. రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సీఎం కప్ పేరిట పోటీలను నిర్వహిస్తోందని, దాదాపు 45కి పైగా క్రీడలను ప్రవేశపెట్టినట్టు తెలిపారు. వేములవాడలో క్రీడాకారుల కోసం 5 ఎకరాల స్థలం కేటాయించామని, స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. బాలుర విభాగంలో ఖమ్మం, బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ మొదటి స్థానాల్లో నిలిచాయి.