|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 02:03 PM
మదర్ డైరీ పాలక వర్గం మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు.ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు, భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ రెడ్డి గారు,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు,నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం గారు,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు,దేవర కొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు,నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవిర్ రెడ్డి గారు,మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు,విజయ డైరీ గుత్తా అమిత్ రెడ్డి గారు ఈ భేటి లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నార్ముల్ మదర్ డైరీ సంస్థ ప్రస్తుత స్థితిగతులను ముఖ్యమంత్రికి వివరించారు.ఈ సందర్భంగా సంస్థ నిర్వహణ,రైతులతో అనుసంధానం,పాలు సేకరణ వ్యవస్థ,ఉత్పత్తుల విస్తరణ,మార్కెటింగ్ వ్యూహాలు మరియు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై చర్చ జరిగింది.దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మదర్ డైరీ అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.