బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 02:24 PM
అలంపూర్ మండల కేంద్రంలోని క్యాతూర్ గ్రామంలో స్థానిక వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. మండలంలో 10076 మంది రైతులుండగా, 5172 మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. మిగిలిన 4904 మంది ఈనెల 28లోపు గ్రామ విస్తరణ అధికారి లేదా మీసేవ కేంద్రాలలో నమోదు చేసుకోవాలని నాగార్జున రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.