|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:04 PM
కోలీవుడ్ అగ్ర నటులు అజిత్, విజయ్ మధ్య వైరం ఉందంటూ సోషల్ మీడియాలో తరచూ ప్రచారం జరుగుతుంటుంది. ఇరు హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో, ఈ ఫ్యాన్ వార్స్‌పై, విజయ్‌తో తనకున్న సంబంధంపై అజిత్ కుమార్ స్పష్టతనిచ్చారు. తనకు ఎవరితోనూ, ప్రత్యేకించి విజయ్‌తో ఎలాంటి శత్రుత్వం లేదని తేల్చి చెప్పారు.ఈ విషయంపై అజిత్ మాట్లాడుతూ.. "కొంతమంది మా ఇద్దరి మధ్య అపోహలు సృష్టిస్తున్నారు. వాటిని చూసి అభిమానులు పరస్పరం గొడవ పడుతున్నారు. ఇలా సమస్యలు సృష్టించేవారు మౌనంగా ఉంటే అందరికీ మంచిది. నేను ఎప్పుడూ విజయ్‌కి మంచి జరగాలనే కోరుకుంటాను, ఎప్పటికీ కోరుకుంటూనే ఉంటాను" అని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి బయటపడింది.ఇటీవల అజిత్ మేనేజర్ సైతం ఇదే విషయంపై మాట్లాడిన సంగతి తెలిసిందే. అజిత్, విజయ్ మంచి స్నేహితులని, అజిత్‌కు పద్మభూషణ్ వచ్చినప్పుడు మొట్టమొదట శుభాకాంక్షలు చెప్పింది విజయ్ అని ఆయన గుర్తుచేశారు. ఈ తాజా వ్యాఖ్యలు ఆ వాదనకు మరింత బలాన్నిచ్చాయి.
Latest News