|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 03:09 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అందింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'చికిరి చికిరి' పాట పూర్తి వీడియోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కేవలం లిరికల్ వీడియో కాకుండా నేరుగా పూర్తి వీడియో సాంగ్‌ను విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్స్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి.ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ 'పెద్ది' అనే పాత్రలో కనిపించనుండగా, ఆయన సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన పాటలో, తన ప్రేయసి 'చికిరి'ని ఊహించుకుంటూ 'పెద్ది' కొండ అంచున నిలబడి నృత్యం చేసే సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. "ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క... నా ఒళ్లంతా ఆడిందే తైతక్కా" అంటూ సాగే సాహిత్యం మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సాధారణ ఫ్యాంటు, షర్టు ధరించి మెడలో కర్చీఫ్ కట్టుకుని చరణ్ వేసిన సిగ్నేచర్ స్టెప్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Latest News