![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:43 AM
'కోర్ట్' సినిమా హిట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి దర్శకుడు రామ్ జగదీశ్ వైపుకు మళ్లింది. తాజాగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా గురించిన విషయాలను పంచుకున్నాడు. "ఈ కథపై రీసెర్చ్ కి, రైటింగ్ కి దాదాపు రెండున్నరేళ్లు పట్టింది. ఈ కథలో హీరోగా ప్రియదర్శిని అనుకున్నాను. ఆయనే నానీని కలవమని చెప్పారు. నాని అపాయింట్మెంట్ కోసం 8 నెలలు వెయిట్ చేశాను" అని అన్నారు. "ఈ సినిమాను కథగా చెబితే పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించదు. తెరపై చూస్తే ఎలా ఉంటుందనేది జడ్జ్ చేయగల నిర్మాత కావాలని అనిపించింది. అందువలన నానీగారికి వినిపించడమే బెటర్ అనే ఉద్దేశంతో కలవడం జరిగింది. నానిగారికి ముందు ఏ నిర్మాత దగ్గరికి వెళ్లలేదు. స్క్రిప్ట్ విన్న నానిగారు ఎలాంటి మార్పులు చేయమని అడగలేదు. ఆయనకి వినిపించిన కథను యధాతథంగా తెరపైకి తీసుకొచ్చాను" అని అన్నారు. "కోర్టుకు సంబంధించిన ఒక అంశాన్ని రియల్ లైఫ్ లో నుంచి తీసుకోవడం జరిగింది. అందువలన మరింత సహజంగా అనిపించడమే కాకుండా, ఆడియన్స్ లో ఆసక్తి పెరగడానికి కారణమైంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఆడియన్స్ గెస్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా కుదరడం వలన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను నేను ఎంజాయ్ చేస్తున్నాను" అని చెప్పారు.
Latest News