![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:50 AM
ఎన్నో సూపర్ డూపర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించనుంది. ఆ చిత్రమే ‘L2E ఎంపురాన్’. మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘L2E ఎంపురాన్’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయబోతోన్నారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ హై ఆక్టేన్, స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండటం విశేషం.ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోశ్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫరీదాబాద్, సిమ్లా, లేహ్, యూకే, అమెరికా, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యూఏఈ, ముంబయి, కేరళతో సహా పలు ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సుజిత్ వాసుదేవ్, ఆర్ట్ డైరెక్టర్ గా మోహన్‌దాస్, స్టంట్ డైరెక్టర్ గా స్టంట్ సిల్వా, క్రియేటివ్ డైరెక్టర్ గా నిర్మల్ సహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ గా దీపక్ దేవ్ పని చేశారు.
Latest News