![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 04:16 PM
ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు నటుడు రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వార్నర్‌ను తిట్టినట్లు సరదా కామెంట్స్ చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఓ వీడియో విడుదల చేశారు.
ఆ తర్వాత నువ్ యాక్టింగ్ చేస్తున్నావు కదా యాక్టింగ్ లోకి రా నీ సంగతి చెప్తాను అన్నాను..అతను అన్నాడు మీరు క్రికెట్ లోకి రండి మీ సంగతి చెప్తానన్నాడు.. ఇలా చాలా అల్లరి చేశాము. ఏది ఏమైనా తెలియకుండా ఎవరినైనా బాధపెట్టి ఉంటే మీ అందరికి సారీ చెప్తున్నాను. ఇక ముందు జరగదు.. జరగకుండా చూసుకుందాం. మార్చి 28న రాబిన్ హుడ్ సినిమా అందరు చూడాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. నితిన్, శ్రీలీల హీరో, హీరోయిన్లు గా నటించిన చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఈ సినిమాను ‘పుష్ప2’ ఫేమ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
Latest News