by Suryaa Desk | Sat, Sep 14, 2024, 03:07 PM
బిఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి జరుగుతున్న ఘటనలోశుక్రవారం ఉదయం పోలీసులు అక్బరుపేట-భూంపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జిడిపల్లి రవి పిఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాష్ తో పాటు సీనియర్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి భూంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు .ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిడిపల్లి రవి మాట్లాడుతూ ఉద్యమకారులకు ఇలాంటి అరెస్టులు కొత్త కాదని,నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేశామని, మాకు ఎన్ని అడ్డంకులు స్పృష్టించి అక్రమ అరెస్టులతో ఉద్యమాలని ఆపలేరని పార్టీలు మారిన ఎమ్మెల్యేలను ప్రజా క్షేత్రంలో తిరగకుండా చేస్తామని అన్నారు.
అరెస్ట్ అయిన వారిలో పార్టీ సీనియర్ నాయకులు బోయ శ్రీనివాస్,కాలేరు శ్రీనివాస్,ర్యాకం శ్రీరాములు,ఉళ్ళెంగల నరేష్,అయితం శ్రీనివాస్,సంద సిద్దిరాములు,దుంపలపల్లి తిరుపతి గౌడ్,కాముని నర్సింలు,ఎల్కాపల్లి స్వామి,జిడిపల్లి కిషన్,జిడిపల్లి శ్రీనివాస్,శ్యామ రవి,చౌదర్పల్లి మహంకాళి,బండరి స్వామి,మెరుపుల స్వామి,శేర్ల చంద్రం,పాతూరి శ్రీనివాస్,జన్నరెడ్డి పార్టీ నాయకులు ఉన్నారు.