by Suryaa Desk | Sun, Sep 15, 2024, 10:36 PM
శనివారం రోజు తిప్పర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో గత సంవత్సరములుగా అక్కడే బోధిస్తున్న ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంతో అక్కడ పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని.
ఉపాధ్యాయులు బదిలీపై వేరే చోటుకు వెళుతున్నందున గత పది సంవత్సరాలు తమతో అనుబంధం ఏర్పరచుకున్న ఉపాధ్యాయులు తమను విడిచి వెళుతున్న సందర్భంలో విద్యార్థిని, విద్యార్థులు ఉపాధ్యాయులు పట్టుకొని బోరున ఏడ్చారు తమను విడిచి వెళ్ళవద్దని టీచర్లను వేడుకున్నారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను చూసి భావోద్వేగానికి గురై బదిలీలపై తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్నామని అందరూ కూడా బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని ఉపాధ్యాయులు కోరారు.