by Suryaa Desk | Sun, Sep 15, 2024, 08:01 PM
పెద్దపల్లి పట్టణంలో పిల్లల వైద్యుడు కొక్కుల రాజేష్ పై జరిగిన హత్యాయత్నం నిరసనగా హిందూ ఐక్యవేదిక పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ బంధు పిలుపుకి పిలుపునివ్వగా పోలీసులు హిందూ ఐక్యవేదిక నాయకులని ముందస్తుగా అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా నిర్వహించదలచిన బందును అడ్డుకొని మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయడం.
పోలీసుల హేయమైన ఈ చర్యను తీవ్రంగా ఖండించడం జరిగింది.అలాగే డాక్టర్ పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని, అలాగే హత్యయత్నంతో పాటు ఆసుపత్రి ధ్వంసంకి పాల్పడిన అతని అతనికి సహకరించిన సుమారు వందమంది పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు హిందూ ఐక్యవేదిక నాయకులు ఉన్నారు.