by Suryaa Desk | Sat, Sep 14, 2024, 03:44 PM
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న సబ రిజిస్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అధిక సంఖ్యలో ప్రజలు వేచి చూడకుండా రిజిస్ట్రేషన్లు , మ్యూటేషన్ డాక్యుమెంట్లను త్వరితగతిన సకాలంలో అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం తరలించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది వారు నిర్వహిస్తున్న విధుల అడిగి తెలుసుకున్న కలెక్టర్ పలు సూచనలు చేశారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి సబ్ రిజిస్టర్ బి కుమార్, రామగుండం సబ్ రిజిస్టర్ తిరుపతి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.