by Suryaa Desk | Sun, Sep 15, 2024, 07:37 PM
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ భావన నిర్మాణం 21/03/2011 లో శంకుస్థాపన చేసిన అప్పటి ఎమ్మెల్యే , ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణ రావు, నేటికీ పూర్తి కాలేదు పంచాయితీ భవన నిర్మాణం అసంపూర్తిగా ఆగి పోవడానికి కారణాలు కూడా అధికారులు చెప్పడం లేదు దానిపై పట్టించుకొనే వారు లేరు.పాత పంచాయితీ భవనం శిధిలమైన కారణంగా,పాత భవనం వర్షం నీరు భవనంలోకి చేరడం,ఒకే చిన్న రూములో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు.
ఆ కారణంగా కొత్త పంచాయితీ భవనం కట్టడానికి ఆమోదం తెలిపిన గత ప్రభుత్వం,అధికారులు భావన నిర్మాణం చేసి మధ్యలోనే ఆపేసిన కాంట్రాక్టర్స్ , కొత్త భవనం కూడా గోడలు కిటికీలు, దర్వాజలు ధ్వంసమై శిథిలావస్థలో ఉన్న కొత్త గ్రామపంచాయతీ భవనం పట్టించుకోని గత ప్రభుత్వాలు, 2011లో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఒకరే కాబట్టి, ఎమ్మెల్యే విజయ రమణా రావు చొరవ తీసుకొని గ్రామపంచాయతీ నూతన భవనం పూర్తిచేసి నిర్మించాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.