by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:12 PM
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ మత్స్యశాఖ దినోత్సవ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మత్స్యశాఖ లోగోను ఎమ్మెల్యే విజయరమణ రావు ముదిరాజ్ కులస్తులతో స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం మత్స్యశాఖ జెండాను ఎమ్మెల్యే ఎగురవేశారు.
ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కి ముదిరాజులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.ముదిరాజులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేస్తుందన్నారు.
గ్రామాల్లో చెరువులు అన్యక్రాంతం అవుతున్నాయని అన్యక్రాంతమైన భూములను గుర్తించి చెరువు సరిహద్దులు ఏర్పాటు చేసే విధంగా చూస్తామన్నారు. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముదిరాజులకు ఉచిత చేపల పంపిణీ కోసం 500 కోట్లు ఖర్చు పెడతామని చెప్పిందని కానీ ముదిరాజులకు ఉచిత చేపల పిల్లల కోసం 60 కోట్లే ఖర్చు పెట్టి 500 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే యాసంగికి నాణ్యమైన చేపలను ముదిరాజు సోదరులకు అన్నారు. ముదిరాజులంతా కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్వలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి లంక సదయ్య, మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్, మాజీ ఎంపీటీసీ సుంకం నిర్మల మల్లారెడ్డి, ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు తూడి సదయ్య, ఉపాధ్యక్షులు కల్వాల తిరుపతి, ప్రధాన కార్యదర్శి పెండం సతీష్, సభ్యులు తుడి రవి, తుడి వెంకటేష్, తోడి వినోద్, చొప్పరి సాయిరాం, చినవేని రాజేందర్, రెడ్డి అంకుష్, రాణవెన శ్రీనివాస్, సతీష్, మండల కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు మహిళలు ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.