by Suryaa Desk | Fri, Nov 22, 2024, 04:21 PM
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరంగా మారిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. పికెట్లోని తన క్యాంపు కార్యాలయం వద్ద 30 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే శుక్రవారం పంపిణీ చేశారు. సీఎం సహాయంతో త్వరగా చెక్కులను మంజూరయ్యేలా చూస్తున్నామని తెలిపారు. పేద ప్రజలు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవాలన్నారు.