by Suryaa Desk | Sat, Nov 23, 2024, 12:05 PM
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సభ్యుల ఆధ్వర్యంలో బీసీల స్థితిగతులపై బహిరంగ విచారణలో శుక్రవారం పొలిటికల్ జేఎసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. వారికి 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని వారి స్థితిగతులపై ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ రిలీజ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి. వెంకటయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు.