|
|
by Suryaa Desk | Sun, Jan 11, 2026, 03:00 PM
మార్కెట్ డల్‌గా ఉండటంతో బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, మాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్, శాండిల్ వుడ్ స్టార్ యశ్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరోలు విలన్ పాత్రలు పోషించడానికి ఆసక్తి చూపుతున్నారు. అభిషేక్ బచ్చన్ 'కింగ్' సినిమాలో షారూఖ్‌తో తలపడనున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో 'వారణాసి'లో రణ కుంభ రోల్ చేస్తున్నారు. యశ్ 'టాక్సిక్' తర్వాత భారీ బడ్జెట్ 'రామాయణం'లో రావణుడిగా కనిపించనున్నారు. విజయ్ సేతుపతి 'జవాన్' తర్వాత కూడా 'మహారాజా', 'తలైవన్ తలైవి' వంటి చిత్రాల్లో విలన్ పాత్రలు చేస్తున్నారు.
Latest News