|
|
by Suryaa Desk | Tue, Jan 13, 2026, 04:05 PM
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. జనవరి 9న విడుదలైన ఈ హారర్-కామెడీ ఎంటర్‌టైనర్.. మిక్స్‌డ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.201 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రత్యేకించి మూడో రోజు వసూళ్లు రెండో రోజుకంటే ఎక్కువగా ఉండటం విశేషం. సంక్రాంతి సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest News