|
|
by Suryaa Desk | Mon, Mar 24, 2025, 01:48 PM
వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ హీరో సుహాస్ 'ఓ భామా అయ్యో రామ' తో మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో ప్రతి ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండిపోయింది. ఇక ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ హీరోయిగా నటిస్తోంది. ఈ సినిమాకు రామ్ గోధల దర్శకత్వం వహిస్తుండగా... వీ ఆర్ట్స్ పతాకంపై హరీశ్ నల్ల నిర్మిస్తున్నారు. మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ బాణీలు అందిస్తున్నారు. అనితా హసనందిని, అలీ, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News