|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 11:36 AM
ప్రముఖ తమిళ నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు రూ.21 కోట్లను 30 శాతం వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. గత కొంతకాలంగా విశాల్‌కు, లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదంలో ఈ తీర్పు కీలక పరిణామంగా మారింది. విశాల్ 2016లో తన 'మరుదు' సినిమా నిర్మాణం కోసం లైకా ప్రొడక్షన్స్ నుంచి రూ.15 కోట్ల ఆర్థిక సహాయం తీసుకున్నారు.
Latest News