|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 11:38 AM
తమిళనాడులోని సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దసరా మూవీ విలన్ షైన్ టామ్ చాకో తండ్రి సి.పి.చాకో మృతి చెందారు. ఈ ప్రమాదంలో చాకో, ఆయన తల్లి కార్మెల్ గాయపడ్డారు. కేరళలోని కొచ్చి నుండి బెంగళూరుకు తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తున్న ఆయన కారును శుక్రవారం ఉదయం లారీ ఢీకొట్టింది. సేలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షైన్ టామ్ జిగర్తాండ డబుల్ ఎక్స్, దేవర, దసరా వంటి చిత్రాల్లో నటించారు.
Latest News