by Suryaa Desk | Sat, Sep 14, 2024, 02:58 PM
వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవరకొండ పట్టణ లో బి ఎన్ ఆర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున విఘ్నేశ్వరస్వామి వారికి ప్రత్యేక అర్చనలు, మహిళా భక్తులచే కుంకుమ పూజలు జరిపించారు అనంతరం బి ఎన్ ఆర్ యూత్ సభ్యులు నిర్వహించిన విఘ్నేశ్వర స్వామి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న సముద్రాల రాకేష్ మాట్లాడుతూ వినాయక మండపంలో పిల్లలు పెద్దలు తేడా బేధం లేకుండా పాల్గొని ఎంతో చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించారు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ కాలనీవాసులకు కలగజేయాలని కోరుకున్నారు.
గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీ వాసులు మహిళలు పెద్దలు పిల్లలు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఎన్ ఆర్ కాలనీ యూత్ కమిటీ సభ్యులు తాళ్ల శ్రీధర్ గౌడ్, కవిటి శ్రీకాంత్, మహేష్, వనం విశ్వ సాయి, హరీష్ రాము దువ్వ తేజ, అజ్జు ప్రవీణ్, యశ్వంత్ సన్నీ, బన్నీ , పానగంటి శ్రీను, అశోక్, గోవింద సత్యం, గోపి, తదితరులు పాల్గొన్నారు