by Suryaa Desk | Sun, Sep 15, 2024, 11:14 AM
నంబర్ ప్లేట్ లేకుండా బండి నడిపిన వ్యక్తి పై చార్మినార్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు..నాపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆ కేసులు కొట్టివేయాలని హైకోర్టుకి వెళ్ళాడు వాహనదారుడు..కేసు విచారణ జరిపిన హైకోర్టు వాహనదారుడిపై చీటింగ్ కేసు ఎలా పెడతారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే నిబంధనల ప్రకారం జరిమానా విధించాలి లేదా కేసు నమోదు చేయాలి కానీ చీటింగ్ కేసు లాంటివి నమోదు చేయకూడదు అని పోలీసులు పెట్టిన సెక్షన్లను హైకోర్ట్ కొట్టి వేసింది.