by Suryaa Desk | Sun, Sep 15, 2024, 02:18 PM
ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు భక్తుల కష్టాలు చూసి తేలికైన మార్గాన్ని చూపించిన ‘మోక్ష’ప్రదాయకుడు.. ప్రాజెక్టుల రూపశిల్పిగా దేశం గర్వించదగ్గ ఇంజినీరు.. జలవనరుల సద్వినియోగంలో అంతర్జాతీయంగా పేరుగాంచిన ‘కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్’.. ఇంజినీరింగ్ రంగ పితామహుడు.. భారతరత్న బిరుదాంకితుడు.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి నేడు. ఈయన స్మారకార్థం ప్రతి ఏడాది ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా నిర్వహించుకుంటున్నాం.