by Suryaa Desk | Sun, Sep 15, 2024, 03:51 PM
మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్ రావు ఖైరతాబాద్ మహా గణనాథుడిని దర్శించుకున్నారు.గణపతి ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద ఖైరతాబాద్ గణేష్ మహరాజ్‌ను దర్శించుకోవడం సంతోషకరమని హరీష్ రావు అన్నారు. వినాయక చవితి అంటే డెవోషన్ మాత్రమే కాదు ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరి విఘ్నాలు తొలిగి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.