by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:24 PM
పెద్దపల్లి జిల్లాలో మరో 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జనవరి నాటికి పెద్దపెల్లి జిల్లాలో కొత్తగా 950 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు మొక్కల ప్లాంటేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తెలిపారు.
ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు వచ్చిన రైతుల నుంచి మొక్కలకు, డ్రిప్ కోసం వెంటనే డీడీలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు.డీడీలు సమర్పించిన రైతులకు మొక్కల సరఫరా, డ్రిప్ సౌకర్యం ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో డి.హెచ్.ఎస్.ఓ జగన్మోహన్ రెడ్డి,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.