|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 01:57 PM
నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. కోర్టు సిబ్బంది వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షిదారులను అప్రమత్తం చేసి బయటకు పంపారు. బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోర్టులో బాంబు అమర్చామని, అది పేలబోతుందని దుండగులు మెయిల్‌లో పేర్కొన్నారు.