|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 03:32 PM
అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని.. రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో పదవ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని.. సంపూర్ణ విశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. గత దశబ్ద కాలంగా నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులకు..సొంత నిధులతో పరీక్ష సామాగ్రి తో పాటు మోటివేషనల్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.