|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 03:35 PM
ప్రముఖ మలయాళం నటుడు టామ్ చాకో యొక్క 70 ఏళ్ల తండ్రి సిబి చాకో బెంగళూరు సమీపంలో ఈ తెల్లవారుజామున ఒక విషాద రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, తమిళనాడులోని ధర్మపురికి దగ్గరగా ఉన్న పాలకోట్టైకి సమీపంలో ఉదయం 7 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు ఉన్న లారీని ఢీ కొట్టింది. షైన్ టామ్ చాకో, తన తల్లి, సోదరుడు మరియు డ్రైవర్ కి గాయాలు తగిలాయి. వైద్య చికిత్స కోసం అందరినీ వెంటనే పాలకోట్టైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిబి చాకో తీవ్రమైన గాయాలతో బాధపడ్డాడు దీని ఫలితంగా అయన మరణించారు. మిగిలిన కుటుంబ సభ్యులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. షైన్ టామ్ చాకో కి ఫ్రాక్చర్ అయ్యింది.
Latest News