by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:35 PM
రైస్ మిల్లులలో ధాన్యం దిగుమతి చేసే ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు.గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలో ఉన్న వసుంధర రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, రైస్ మిల్లు కు అలాట్ ధాన్యం కోనుగోలు కేంద్రాలు, ఇప్పటి వరకు ఎంత ధాన్యం వచ్చింది, వాటి వివరాలను , రిజిస్టర్ లను కలెక్టర్ పరిశీలించారు.
కొనుగోలు చేసిన ధాన్యం సంబంధించి రైస్ మిల్లుల వద్ద త్వరగా దిగుమతి చేసుకునేలా చూడాలని, రైస్ మిల్లులు వద్ద ఎక్కువ సమయం ధాన్యం వాహనాలు వెయిట్ చేయకుండా చూడాలని, అవసరమైన మేర హమాలీలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను త్వరితగతిన ఓపిఎంఎస్ వెబ్ సైట్ లో నమోదు చేయాలని అన్నారు.ఈ తనిఖీలలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.