by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:39 PM
వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో గురువారం 2024 సంవత్సరం బ్యాచ్ లోని 271 ఏఆర్ ఎస్ సీ టీ పీ సీ ఎస్ ల దీక్షాంత్ (పాసింగ్ అవుట్ ) పరేడ్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మల్టీ జోన్ -2, ఐజీపీ శ్రీ వి.సత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. రామగుండం నుండి 119 మంది, సిద్దిపేట్ నుండి 60, కొమరం భీమ్- ఆసిఫాబాద్ నుండి 58 మంది మరియు మహబూబాబాద్ నుండి 34 మంది మొత్తం 271 మంది ఇట్టి పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధి గారిని డిటిసి ప్రిన్సిపాల్ పివి మురళీధర్ గారు స్వాగతం పలకడం జరిగింది. ఐజీపీ పోలీస్ అధికారులతో కలసి దీక్షాంత్ పరేడ్ ప్లటూన్ల వారీగా టర్న్ ఔట్ పరిశీలించడం జరిగింది. తర్వాత డిటిసి ప్రిన్సిపాల్ పివి మురళీధర్ ట్రైనింగ్ వివరాలతో పూర్తి నివేదికను చదివి వినిపించడం జరిగింది. అనంతరం పరేడ్ కమాండర్ ఎల్ .సురేశ్ ఐజీపీ గారి ఆదేశాలమేరకు పాసింగ్ ఔట్ పరేడ్ “మార్చ్ పాస్ట్” నిర్వహించడం జరిగింది. డిటిసి ప్రిన్సిపాల్ పివి మురళీధర్ దీక్షాంత్ పరేడ్ లో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి రాజ్యాంగ బద్దంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు సేవ చేస్తాం అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం వివిధ రంగాలలో విజేతలుగా నిలిచిన టైనీ కానిస్టేబుల్ లకు ముఖ్య అతిధి ఐజీపీ బహుమతులు ప్రదానం చేయడం జరిగింది.ఇందులో బెస్ట్ ఇండోర్ ఎస్.నాగేందర్, బెస్ట్ ఔట్ డోర్, బెస్ట్ అల్ రౌండర్ గా ఎల్ .సురేష్, బెస్ట్ ఫైరర్ గా ఓ.వినోద్ కుమార్ లకు బహుమతులు ఇవ్వడం జరిగింది.అనంతరం ఐజీపీ మాట్లాడుతూ తెలంగాణ ఊటీగా పేరు పొందిన వికారాబాద్ లోని శిక్షణ కేంద్రంలో విజయవంతంగా ప్రాధమిక శిక్షణ ముగించుకొన్న 271 మంది కానిస్టేబుల్ లకు హర్ధిక శుభాకాంక్షలు, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి స్వాగతం.
శిక్షణలో పాల్గొన్న 271 మంది అభ్యర్థులలో అందరూ కూడ అన్నీ పరీక్షలలో ఉత్తీర్ణులు అవ్వడం జరిగింది. ఎంతో కష్టపడి జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి , డిటిసి ప్రిన్సిపాల్ పివి మురళీధర్ గారు, వైస్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గారు,ఇండోర్ ,ఔట్ డోర్ ఫ్యాకల్టీ సభ్యులు విజయవంతగా ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. విధులను చాలా చక్కగా , రాజ్యాంగ బద్దంగా, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ, ప్రజలకు సేవ చేయాలని, ప్రజల శాంతిభద్రతల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల ద్వారా నియమించబడి, అన్నీ అంశాలలో పూర్తిగా శిక్షణ పొంది శాంతి భద్రతలను సంరక్షిస్తూ, ప్రజల జీవితాలకు, ఆస్తులకూ రక్షణ కల్పిస్తూ, నేరాలు, విధ్వంసాలూ జరక్కుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థనే పోలీసు డిపార్ట్మెంట్. నేటి కాలం లో ప్రజలకు పోలీస్ పరోక్షంగాను లేదా ప్రత్యేక్షంగాను సహాయం చేస్తుంది. పోలీస్ లేని సమాజాన్ని ఊహించలేము. సమాజంలో నేరస్థులను, క్రిమినల్స్, రౌడీస్, సస్పెక్ట్స్ లను అదుపులో పెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అవసరం. ఎన్నో రకాలైన ఛాలెంజ్ లను తట్టుకొనే విధంగా, సున్నితంగా, కఠినంగా, క్రమశిక్షణతో ఉండే విధంగా ఈ తొమ్మిది నెలల ట్రైనింగ్ లో నేర్పడం జరిగింది.విధులు నిర్వహించే టప్పుడు సహనం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దైర్యం తో విధులు నిర్వర్తించాలి. అప్పగించిన భాధ్యతలు సక్రమంగా సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ప్రధానంగా ప్రజల రక్షణ మన భాధ్యత అని, వారి హక్కులను, ఆత్మగౌరవం భంగం కలగకుండా ప్రజలతో మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. సమాజం మొత్తాన్ని మన కుటుంబంగా బావించాలి. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణ అనేది చాల ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నిత్యం పని వత్తిడి, ప్రతికూల పరిస్థితులలో భాధ్యతలు నిర్వహించాల్సి వుంటుంది కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్నెస్ చాల ముఖ్యమైనదనిఅన్నారు.
తొమ్మిది నెలల శిక్షణలో పోలీసు పరిపాలన, డాక్యుమెంటేషన్, వ్యక్తిత్వ వికాసం, లా& ఆర్డర్, ఇంటెలిజెన్స్ మరియు అంతర్గత భద్రత, క్రిమినల్ చట్టం బీ న్ ఎస్ & బీ న్ ఎస్ ఎస్ , ఎస్ ఎల్ ఎల్ , నేరం మరియు విచారణ, ఫోరెన్సిక్ సైన్స్ మరియు ఫోరెన్సిక్ మెడిసిన్. అదేవిధంగా అవుట్‌డోర్స్ ఫిజికల్ ట్రైనింగ్, స్క్వాడ్ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, టియర్ గ్యాస్ మరియు మాబ్ ఆపరేషన్‌లు, వెపన్ ట్రైనింగ్, ఫీల్డ్ క్రాఫ్ట్ & ట్రాఫిక్ డ్రిల్, ఫస్ట్ ఎయిడ్,డ్రిల్, ఇండోర్, అవుట్ డోర్ అన్ని అంశాలను క్రమపద్ధతిలో నేర్చుకొని శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు.
అనంతరం ఐజీపీ విజయవంతంగా తొమ్మిదినెలల ట్రైనింగ్ పూర్తి చేయడంలో భాగం అయిన డిటిసి ప్రిన్సిపాల్ పివి మురళీధర్ గారికి, డిటిసి డిఎస్‌పి విజయ్ కుమార్ గారికి, ఇన్స్పెక్టర్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఆర్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు, ఇండోర్, ఔట్ డోర్ ఫ్యాకల్టీ సభ్యులకు అందరికీ మేమంతోలు ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిటిసి ప్రిన్సిపాల్ పివి మురళీధర్ , జిల్లా అదనపు ఎస్పీ యూ .రవీందర్ రెడ్డి , డిటిసి డీస్పీ విజయ్ కుమార్ , వికారాబాద్ డిఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి , ఏ ఓ జోతిర్మని , ఇన్స్పెక్టర్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఆర్‌ఐ లు, ఆర్‌ఎస్‌ఐ లు, ఇండోర్, ఔట్ డోర్ ఫ్యాకల్టీ , ట్రైనీ కానిస్టేబుల్ లు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.