by Suryaa Desk | Fri, Nov 22, 2024, 03:41 PM
నూతనంగా మహబూబాబాద్ జిల్లాకు విద్యాశాఖ అధికారిగా నియమితులైన ఎ. రవీందర్ రెడ్డి ఈరోజు గూడూరు మండల కేంద్రంలోని గూడూర్ బాయ్స్ హై స్కూల్ ను, మధ్యాహ్న భోజనం సమయంలో పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. గుడ్లు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా పరిశీలించారు. ఈ సందర్భంగా డిఇఓ రవీందర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించారు. అదేవిధంగా మండల స్థాయి చెకుముకి పరీక్షలో గెలుపొంది, జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించి, షీల్డ్లు బహూకరించారు.
అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. విద్యార్థులకు 10/10 గ్రేడ్ సాధించడానికి 100% విద్యార్థులు ఉత్తీర్ణులు కావడానికి పలు సూచనలు సలహాలు, విద్యార్థులకు సూచించారు. తప్పకుండా విద్యార్థులు 10/10 జిపిఎ. సాధించేలా కృషి చేయాలని, క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని ఉపాధ్యాయులకు కూడా, పలు సూచనలు చేశారు. ప్రత్యేక తరగతులు ప్రత్యేక చాప్టర్ వైస్ గా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. తిరిగి మళ్లీ పాఠశాలను సందర్శిస్తానని, ఆలోపు విద్యార్థులు మరింత పురోభివృద్ధి సాధించాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రవికుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదాశివ, ఉపాధ్యాయులు, హరి శంకర్, సునీత, శ్రీనివాస్, శరత్ బాబు, అనిల్ కుమార్, సంధ్యారాణి, శ్రీధర్, ప్రమీల, వెంకటేశ్వర్లు, యాకలక్ష్మి పాల్గొన్నారు.